Donald Trump : మెక్సికో, కెనడాకు ట్రంప్ రిలీఫ్

మెక్సికో నుంచి దిగుమతి అయ్యే సరుకుల్లో అత్యధిక రకాలకు 25 శాతం సుంకం (Tariff) విధాంచాలన్న నిర్ణయాన్ని నెలరోజులపాటు వాయిదా వేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. మెక్సికో (Mexico) అధ్యక్షురాలితో మాట్లాడిన మీదట ఆయన ఈ విషయం వెల్లడిరచారు. మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాకు అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారీస్థాయిలో ట్రంప్ సర్కారు విధిస్తున్న సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మండిపడ్డారు. కెనడా`అమెరికా మధ్య భవిష్యత్తులో వాణిజ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సుంకాల అమలును నెలరోజుల పాటు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమన్నారు. కెనడా వస్తువులపై అమెరికా సుంకాలు ఎత్తివేసే వరకు ప్రతీకార సుంకాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.