Donald Trump : ట్రూడో ఆ విషయం చెప్పలేదు : ట్రంప్

అమెరికా, కెనడాల మధ్య సుంకాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు జరిగిన ఈ సంభాషణలో ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, సుంకాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడిరచారు. అమెరికాతో సుంకాల విధానాన్ని ట్రూడో అధికారంలో కొనసాగడానికి వినియోగించుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సుంకాల విషయంపై మాట్లాడాను. మెక్సికో (Mexico) సరిహద్దుల గుండా అక్రమంగా వస్తున్న ఫెంటానిల్ డ్రగ్ కారణంగా అనేక మంది మరణించారు. ఈ విషయాన్ని నేను ట్రూడోకు వివరించాను. దాన్ని అడ్డుకుంటాన్నామనే ఆయన వాదనలను కొట్టిపారేశాను. ఇక కెనడా (Canada )ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచినా, ట్రూడో ఆ విషయం చెప్పలేదు. అధికారంలో కొనసాగేందుకు సుంకాల వివాదాన్ని వినియోగించుకుంటున్నారని అర్థమైంది అని ట్రంప్ పేర్కొన్నారు.