Indians Die: మొజాంబిక్‌లో విషాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి!

మొజాంబిక్‌లో (Mozambique) జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి (Indians Die) చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని బీరా ఓడరేవు సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్యాంకర్ (Tanker) కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న లాంచ్ బోటు ఒక్కసారిగా తిరగబడింది. ఈ బోటులో మొత్తం 14 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Indians Die) కోల్పోగా, ఐదుగురు గల్లంతయ్యారు.
ఓడరేవు నుంచి ఒడ్డున ఆపి ఉన్న ఓడకు సిబ్బంది షిఫ్ట్ మారేందుకు లాంచ్ బోట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై మొజాంబిక్‌లోని (Mozambique) భారత హై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గల్లంతైన వారి కోసం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం హై కమిషన్ హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.