మస్క్, వివేక్ రామస్వామితో చైనాకు.. ముప్పు
ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి నేతృత్వంలోని కొత్త విభాగంలో తన ప్రభుత్వాన్ని సంస్కరించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక రచిస్తున్నారని, ఇదే బీజింగ్‌కు అతి పెద్ద ముప్పు అని చైనా ప్రభుత్వ సలహాదారు జెంగ్ యోంగ్నియన్ హెచ్చరించారు. చైనా ఇప్పుడు ట్రంప్ 2.0లోని సమర్థ రాజకీయ వ్యవస్థతో పోటీ పడాల్సి వస్తుందని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ( ఐఐఏ) నిర్వహించిన బైచూవాన్ ఫోరంలో ఆయన మాట్లాడారు. అమెరికా కొత్త వ్యవస్థ వల్ల ఒత్తిడి కేవలం చైనాపై మాత్రమే కాదు ఇతరులపైనా ఉంటుందని, ఆది ముఖ్యంగా ఐరోపాపైనా అని చెప్పారు. ఈ సంస్కరణల అమలులో ట్రంప్ విజయవంతమైతే అమెరికా కొత్త, మరింత పోటీ వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్నారు.






