ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు… వచ్చే ఎన్నికల్లో ట్రూడో
కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో పై బిలీనియర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాని జస్టిస్ ట్రూడో ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోడోను వదిలించుకునేందుకు కెనడాకు సాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎలాన్ మస్క్‌ను కోరారు. దీంతో అతడు రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారు అంటూ ఆ యూజర్‌కు బదులిచ్చారు.






