లండన్‌లో తెలుగు విద్యార్థి మృతి
లండన్‌లో పుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన దేవులపల్లి రమేశ్- రజిత దంపతులు నిరుపేదలు. రమేశ్ సైకిల్ పంచర్లు వేస్తూ రజిత కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు దేవుపల్లి ప్రణయ్ (25) వరుణ్ ఉన్నారు. డిగ్రీ చదివిన ప్రణయ్ ఏడాది క్రితం తెలిసిన వారి వద్ద అప్పు తీసుకొని ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లారు. 15 రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో మిత్రులు ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆహారం పడలేదని, ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.






