తెలుగు ప్రవాసీకి యూఏఈ ఐకాన్ అవార్డు
దుబాయ్ లోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్ అవార్డుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్ గౌడ్‌కు పురస్కారం దక్కింది. దుబాయి లోని ఒక సంస్థ, ఇండియా టుడే గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్‌కు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా టుడే ప్రతినిధులు, భారతీయ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. దుబాయిలోని తెలుగు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనే శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను వలువురు తెలుగు ప్రముఖులు అభినందించారు.






