Pavel Durov : నా వీర్యదానంతో పుట్టిన పిల్లలకూ సంపద పంచేస్తా : దురోవ్ మరో సంచలన ప్రకటన

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov ) మరోసారి వార్తల్ల నిలిచారు. 15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానం (Sperm donation )తో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మందికిపైగా పిల్లలు (Children) జన్మించినట్లు గతేడాది జులై (July)లో ప్రకటించిన ఆయన, ఆ పిల్లలందరికీ తన సంపదను పంచేస్తానంటూ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. దురోవో ఇటీవలే వీలునామా రాశానని, తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు వీర్యదానం వల్ల పుట్టిన 106 మంది పిల్లలకూ తన ఆస్తి (Property )లో సమాన హక్కు ఉంటుందని అందులో పేర్కొన్నానని తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. అయితే, ఈ సంపదను మరో 30 ఏళ్ల వరకూ (2025 దాకా) వారు పొందలేరని, తన పిల్లలు స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నాని పావెల్ పేర్కొన్నారు. వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి ఆరుగురు పిల్లలున్నారని పేర్కొన్నారు.