GTA : అమెరికాలో జీటీఏ చాప్టర్లు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని దాదాపు 43 దేశాల్లో చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (జీటీఏ) అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) , న్యూయార్క్ (New York) , రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లు (GTA Chapters) ప్రారంభించింది. ఇటీవల న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ అర్బార్బెరియో (James Arbarberio) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్, చాప్టర్ అధ్యక్షుడిగా కపిడి శ్రీనివాస్‌రెడ్డి (Kapidi Srinivas Reddy )ని ఎన్నుకున్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలు విస్తరణకు కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన జీటీఏ 43 దేశాలకు విస్తరించింది.ఈ ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో సమవేశాన్ని నిర్వహిస్తాం. ప్రతి తెలంగాణ ఎన్నారై తమ సొంత గ్రామానికి అనుసంధానం చేసేలా జీటీఏ ప్రయత్నిస్తుంది అని జీటీఏ వ్యవస్థాపకులు, ఇండియా చైర్మన్ అలుమల మల్లారెడ్డి తెలిపారు. డిసెంబరు 25న టీటీఏ దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు టీటీఏ అమెరికా అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జీటీఏ అమెరికా చైర్మన్ విశ్వేశ్వర్‌రెడ్డి, యూఎస్ జీటీఏ అధ్యక్షుడు బాపురెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి, పృథ్వీ రెడ్డి, వాషింగ్టన్ డీసీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి పాల్గొన్నారు.






