ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో.. రతన్ టాటా పేరిట
టాటా గ్రూప్, ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన సోమర్‌విలే కాలేజ్ కలిసి రతన్ టాటా గౌరవార్థం ఒక ప్రతిష్ఠాత్మక భవనాన్ని నిర్మించనున్నాయి. రతన్ టాటా బిల్డింగ్ గా దీనికి పేరు పెడతారు. దీని నిర్మాణం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కొత్త రాడ్క్లిప్ అబ్సర్వేటరీ క్వార్టర్లో వచ్చే ఏడాది ప్రారంభంలో చేపడతారు. సోమర్‌విలే కాలేజ్‌తో మా భాగస్వామ్యం టాటా విలువలకు ఒక నివాళి. ఈ భవనం పరిశోధనలకు నిలయమవుతుంది. భారత్‌కు ఇది తక్షణావసరం అని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.






