అమెరికా అథ్లెట్ కు.. ప్రపంచ రికార్డు

మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో అమెరికా అథ్లెట్ సిడ్నీ మెక్‍లాలిన్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. యూఎస్ ఒలింపిక్స్ ట్రయల్స్ లో మెక్‍లాలిన్ 51.90 సెకన్ల టైమింగ్‍తో రేస్‍ను పూర్తి చేసింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి, సహచరి దలియా మహ్మద్ 2019 వరల్డ్ చాంపియన్‍షిప్‍లో నెలకొల్పిన 52.16 సెకన్ల రికార్డును సిడ్నీ 0.26 సెకన్ల తేడాతో అధిగమించింది. ఈ రేస్‍లో పోటీపడ్డ దలియా 52.42 సెకన్ లో టైమింగ్‍తో రెండో స్థానానికి పరిమితమైంది.