భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండానే
విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రీ టైం ఉంటే కుటుంబంతో కలిసి ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా గడపాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు తీపి కబురు అందింది. భారత పౌరులకు ఆరు నెలల పాటు ఉచిత వీసా సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. భారత్తో సహా 35 దేశాల వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






