అమెరికాలో ఘటన… అత్యవసరంగా రహదారిపై
అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో అత్యవసరంగా రహదారిపై దిగిన చిన్న విమానాన్ని ఓ వాహనం ఢీకొట్టిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉండగా సింగిల్ ఇంజిన్ విమానంలో మెకానికల్ వైఫల్యం తలెత్తింది. వెంటనే గ్రీన్స్బొరోలోని పీడ్మాంట్ ట్రియాడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమాచారం అందింది. అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు విమానం గ్రీన్స్బొరోలో అత్యవసరంగా రహదారిపై దిగింది. ఆ వెంటనే ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.






