Ind vs Eng: ఆ బౌలర్ ఆడుతున్నాడు, గిల్ క్లారిటీ

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న చివరి టెస్ట్ అత్యంత కీలకంగా మారిన నేపధ్యంలో జట్టు కూర్పు విషయంలో భారత్ జాగ్రత్తలు తీసుకుంటుంది. కీలక ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నాలుగో టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బోర్డు పెద్దలు కూడా ఈ విషయంలో సీరియస్ అయినట్టు ప్రచారం జరిగింది. ఇక మరో బౌలర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) అరంగేట్రం విషయంలో కూడా విమర్శలు వచ్చాయి.
లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో.. అతన్ని పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతూ వచ్చారు. ఈ సమయంలో భారత కెప్టెన్ గిల్(Shubhaman Gill) కీలక ప్రకటన చేసాడు. అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఫ్రంట్-లైన్ స్పిన్నర్లుగా ఉంటారని గిల్ స్పష్టం చేసాడు. కుల్దీప్ యాదవ్ ను మాత్రం తీసుకునే అంశంపై ప్రకటన చేయలేదు. అర్షదీప్ సింగ్ ను మ్యాచ్ కు రెడీ కావాలని కోరామని ట్రంప్ ప్రకటించాడు.
పిచ్ ను పరిశీలించిన తర్వాత ప్లేయింగ్ లెవెన్ ను నిర్ణయిస్తామని, పిచ్ పచ్చగా కనపడుతోంది అన్నాడు. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఐదవ రోజు చివరి సెషన్ వరకు జరిగాయని, అయిదవ టెస్ట్ తమకు అత్యంత కీలకం అన్నాడు. వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండటం తమకు చాలా ప్లస్ పాయింట్ అన్నాడు. బ్యాటింగ్ లో అతను ఉంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నాడు. బౌలింగ్ కూడా చేయగల సమర్ధుడు అని, అతను ఉండటం అద్రుష్టం అని కామెంట్ చేసాడు గిల్. ఇంగ్లాండ్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్ తో వెళ్ళడం లేదని, జో రూట్, జాకబ్ బెతల్ వాళ్ళ స్పిన్నర్ లు కావొచ్చు అన్నాడు గిల్.