BCCI: ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ పై బీసీసిఐ ఫోకస్ పెట్టాలా..?
క్రికెట్ విషయంలో భారత్ చాలా దేశాల కంటే ముందుంటుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం భారత జట్టు దే హవా నడుస్తోంది. అయితే ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో మాత్రం విదేశాల్లో ఆందోళన కనపడుతోంది. గత ఏడాది పర్యటనకు వెళ్లిన సమయంలో చాలామంది ఆటగాళ్లు అక్కడి పిచ్ ల మీద ఆడటానికి ఇబ్బందులు పడ్డారు. ఒక కేఎల్ రాహుల్ మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా తడబడినట్లుగానే కనబడింది. గతంలో ఓవర్సీస్ మైదానాల్లో భారత బ్యాటింగ్ లైనప్ ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడేది కాదు.
ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ గిల్(Shubhaman Gill) ఆస్ట్రేలియాలో ఎక్కువగా తడబడ్డాడు. యశస్వి జైష్వాల్ పర్వాలేదనిపించాడు. మిడిల్ ఆర్డర్ కూడా ఆస్ట్రేలియాలో సమర్థవంతంగా కనబడలేదని చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటన జరుగుతోంది. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇంగ్లాండ్ మైదానాలు స్వింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. చల్లని గాలులతో బంతి వేగంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ మైదానాల్లో ప్రస్తుతం సాయి సుదర్శన్, కేల్ రాహుల్(KL Rahul), రిషబ్ పంత్, కరుణ్ నాయర్ వంటి వాళ్లకు మాత్రమే అనుభవం ఉంది. ఇంగ్లాండ్ మైదానాల విషయంలో కెప్టెన్ గిల్ వీళ్ళతో పోలిస్తే వెనుకబడి ఉన్నాడు.
కాబట్టి బోర్డు పెద్దలు.. భారత క్రికెటర్లను ఇంగ్లీష్ కౌంటి మ్యాచుల్లో ఆడిస్తే మంచి ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆటగాళ్లతో పోలిస్తే స్వదేశంలో ఎక్కువ మ్యాచ్లు ఆడే ఆటగాళ్లలో భారత్ ముందుంటుంది. ఐపీఎల్ గాని టెస్టులు గాని వన్డేలు గాని ఎక్కువగా మన దేశంలోనే ఆడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మన ఆటగాళ్లు ప్రభావం చూపించాలి అంటే కచ్చితంగా వారిని ఇంగ్లీష్ కౌంటింగ్ మ్యాచ్లో ఆడిస్తే సేన దేశాల్లో ఆడినప్పుడు మంచి ప్రభావం ఉంటుందని అభిప్రాయాలు వినపడుతున్నాయి.







