అమెరికాలో తీవ్ర కలకలం… హాలోవీన్ వేడుకల్లో
హాలోవీన్ వేడుకల్లో కాల్పుల ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండ్ నగరంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయలయ్యాయి. డౌన్టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వందలాది మంది బహిరంగ ప్రదేశంలో హాలోవీన్ వేడుకలు చేసుకుంటున్న సమయంలో ఈ దుశ్చర్య చోటు చేసుకుందని అర్లాండ్ పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్ తెలిపారు. 17 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు స్మిత్ తెలిపారు.






