New York: న్యూయార్క్‌లో కాల్పులు కలకలం

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ (New York)లో కాల్పులు కలకలం సృష్టించాయి. మాన్‌హట్టన్ (Manhattan) లోని ఓ బిల్డింగ్‌లోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్‌వైపీడీకి చెందిన పోలీస్ (Police) సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. నిందితుడిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏండ్ల షేన్ డెవోన్ తమురా (Shane Devon Tamura)గా గుర్తించారు.మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తముర, బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్‌వైపీడీ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. అనంతరం 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు మరణించారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కాల్పులు జరపడంతో నిందితుడు కూడా గాయపడి ప్రాణాలు వదిలాడు.
అతడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాడని, ఏఆర్ సైల్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams) ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.