Ind vs Eng: తడబడ్డ సాయి సుదర్శన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి సెషన్ లో స్వల్ప ఆధిపత్యం ప్రదర్శించింది. కెఎల్ రాహుల్(KL Rahul) – జైస్వాల్ జోడీ మంచి భాగస్వామ్యం నెలకొల్పగా లంచ్ కు ముందు.. కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ మళ్ళీ పట్టు బిగించింది. ఇక ఆ తర్వాత వచ్చిన కొత్త ఆటగాడు సాయి సుదర్శన్(Sai Sudarshan) డకౌట్ అయ్యాడు. ఐపిఎల్ తో పాటుగా దేశవాళి సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్.. ఇంగ్లాండ్ తో సీరీస్ కు ఎంపిక అయ్యాడు.
దీనితో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెఫ్ట్ హ్యాండర్ మూడవ స్థానంలో ఉంటే బాగుంటుందని భావించిన కెప్టెన్, యాజమాన్యం సాయి సుదర్శన్ కు మూడవ స్థానంలో చోటు కల్పించింది. తొలి మ్యాచ్ కావడం, భారీ అంచనాలు ఉండటంతో సాయి సుదర్శన్ కాస్త ఒత్తిడిగా కనిపించాడు. బెన్ స్టోక్స్ లెగ్ సైడ్ సంధించిన బంతులు ఆడే క్రమంలో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు సాయి సుదర్శన్. దీనితో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఐపిఎల్ మూడ్ లోనే ఉన్నాడని కామెంట్స్ వస్తున్నాయి.
సాయి సుదర్శన్ కు ఇంగ్లాండ్ మైదానాల్లో కౌంటీ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నా సరే.. తడబడటంతో విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ 6 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో అర్శదీప్ సింగ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని కూడా పక్కన పెట్టారు. అనుభవం ఉన్న శార్దుల్ ఠాకూర్ ను ఎంపిక చేయడంతో.. తుది జట్టులో కూడా అతనికే చోటు కల్పించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ బౌలర్ లు పట్టు బిగించడంతో భారత్ ఎంత వరకు నిలబడుతుంది అనేది ఆసక్తిగా మారింది.