రష్యా కీలక ప్రకటన
హెజ్బొల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ మద్దతున్న ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టిన సంగతి తెలిసింది. ఈ దాడులు కొనసాగుతోన్న వేళ, రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ పర్యటించనున్నారని తెలిసింది. ఆ దేశ అధ్యక్షుడితో సమావేశం కానున్నారని వెల్లడించింది. ప్రస్తుత ఉద్రిక్తతల వేళ, ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. నస్రల్లా మరణాన్ని మరో రాజకీయ హత్యగా అభివర్ణించింది. లెబనాన్‌పై దాడులు ఆపాలని సూచించింది.






