అవసరమైతే ఇతర దేశాలపైనా కూడా : పుతిన్
రష్యా తొలిసారి తమపై ఖండాంతర క్షిపణితో దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. నిప్రొ నగరంపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఖండాంతర క్షిపణితో పాటు మరో ఎనిమిది క్షిపణులు కూడా తమ భూభాగంపై దూసుకురాగా వాటిలో ఆరింటిని తాము కూల్చేశామని వివరించింది. ఉక్రెయిన్పై నూతన మధ్యంతరశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర దేశాలపైనా ఇ తరహా క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు. మరోవైపు రష్యాకు చెందిన మూడో అతిపెద్ద గాజ్ప్రోమ్ బ్యాంక్ దాని ఆరు అనుబంధ విదేశీ శాఖలపై అమెరికా ఆంక్షలు విధించింది.






