రష్యాకు కొత్త సమస్య
రెండేళ్లకుపైగా ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిగిపోయి ఉన్న రష్యా కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా రష్యా లో జనన మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఇప్పుడు దానిని పరిశీలిస్తోంది. జనన మరణాల రేటులో అంతరాన్ని తగ్గించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలంటూ అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసింది. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్ని ఈ శాఖ పరిధిలో ఉంచాలంటూ కొన్ని సూచనలు చేసింది. బంధాలను ప్రోత్సహించేదుకు యువతకు ఫస్ట్ డేట్‌కు 5000 రూబెన్స్ ఇవ్వాలని సూచించింది. ఇంటిపనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకునేవారికి కొంతమొత్తం చెల్లించాలని చెప్పింది. వీటితో పాటు మరికొన్ని అసాధారణ ప్రతిపాదనలు చేసింది.






