రష్యా కొత్త తాయిలం.. సైన్యలో చేరితే
ఉక్రెయిన్పై పోరుకు సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలను వాడుతోంది. ఈ పోరు కోసం కొత్తగా సైన్యంలో చేరేవారి రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడేవారికి కోటి రూబుల్స్ వరకు ( సుమారు రూ.80 లక్షలు ) రుణమాఫీ చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. రుణ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి, ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీలోగా చర్యలు మొదలయ్యేవారికి వారి జీవిత భాగస్వాములు అప్పులకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే పలురకాల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించి, సైన్యంలోకి కొత్తవారిని ఆకట్టుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోది. సగటు జీతం కంటే అనేక రెట్లు ఎక్కువ ఇస్తామంటూ కొందరికి చెబుతోంది.






