Narendra Modi : ప్రధాని మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ద్వీపదేశమైన సైప్రస్ (Cyprus) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ (Grand Cross of the Order of Makarios) 3 ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైన కుటుంబకం భావనకు ప్రతీక అని చెప్పారు. ఈ అవార్డు (Award) ను ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరుదేశాల శాంతి భద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్ (India) సైప్రస్ మధ్య ఉన్న క్రియాశీల భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలను చేరుకుంటుందని మోదీ (Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరుదేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి దోహదపడతాయన్నారు.







