దౌత్యానికే మా మద్దతు … యుద్ధానికి కాదు
చర్చలు, దౌత్యానికే తాము మద్దతు ఇస్తామనీ, యుద్ధానికి మాత్రం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతియుత చర్చల ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారాన్ని సాధించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ దేశాల కూటమి 16వ శిఖరాగ్ర సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. కొవిడ్లాంటి మహమ్మారినే ఉమ్మడిగా ఎదుర్కొన్నాం. భద్రమైన, సుసంపన్న, బలమైన భవిష్యత్తును భావితరాలకు అందించే సామర్థ్యం కూడా మనకు ఉంది. ఉగ్రవాదంపై పోరాడటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. ఒకే సంకల్పంతో ఈ మహమ్మారిని అంతం చేసేందుకు మనమంతా చేతులు కలపాలి. ఉగ్రసంస్థలకు నిధులందే మార్గాలు మూసివేయాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఐరాసలో కుదుర్చుకునే అంశంపై మనమంతా పనిచేయాలి. సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ విషయంలోనూ అంతర్జాతీయ నియంత్రణల కోసం కృషి చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు.






