నిర్బంధంలో భారతీయ బిలియనీర్ కుమార్తె
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధరా ఓస్వాల్ ఈ నెల ప్రారంభంలో ఉగాండాలో నిర్బంధానికి గురైన విషయం తెలిసిందే. ఉగాండాలో తమ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీ కార్యకలాపాలు పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను కొందరు సాయుధ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, హత్య అభియోగాలను కారణంగా చూపి, ఆమెను అదుపులోకి తీసుకున్నారని మీడియాతో వసుంధర సోదరి రిధి వెల్లడించారు. పీఆర్ఓ ఇండస్ట్రీస్ వారసురాలైన వసుంధర నిర్బంధంలో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆ రోజు మా కంపెనీలోకి కొందరు సాయుధ పోలీసు అధికారులు ఎలాంటి వారెంట్ లేకుండా దూసుకొచ్చారు. సోదాలు చేయడంతో పాటు వసుంధరను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లారు అని రిధి వెల్లడించారు. ఆమెకు కనీసం పరిశుభ్రమైన తాగునీరు కూడా అందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎలాంటి నోలీసులు లేకుండా ఆమెకు ఒక జైలు నుంచి మరో జైలుకు మారుస్తున్నారు. ఆమెను సంప్రదించడానికి వీలులేకుండా ఇలా చేస్తున్నారన్నారు.






