ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
పాకిస్థాన్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో అక్టోబర్‌లో జరగబోయే షాంఘై సహకార సంఘం సభ్యదేశాల కీలక సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగబోయే సమావేవానికి విచ్చేసే అగ్రనేతలందరికీ ఆహ్వానాలు పంపామని పాక్ విదేశాంగ శాఖ మహిళా అధికార ప్రతినిధి ముంతాజ్ జారా బలూచ్ తెలిపారు. భారత్ ప్రధానికీ ఆహ్వానం వెళ్లింది. కొందరు నేతలు తమ రాకను ఇప్పటికే ధృవీకరించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా అని ఆమె అన్నారు.
కశ్మీర్ సమస్య సహా సీమాంతర ఉగ్రవాదం, తరచూ సరిహద్దుల వెంట ఉగ్ర చొరబాట్లు, పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో దయాదిదేశాలు ఉద్రిక్త పరిస్థితులను చవిచూస్తున్న విషయం తెలిసిందే. షాంఘై సహకార సంఘం సభ్యదేశాల ఆర్థిక, సామాజిక`సాంస్కృతికి, మానవతా అంశాల్లో పరస్పర సహకారంపై ఈసారి సమావేశంలో చర్చించనున్నారు.






