పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట
పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. రెండేళ్ల క్రితం సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో ఇమ్రాన్‌తో పాటు అతని సన్నిహితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనపై ఆరోపణలను కొట్టివేసిన ఇస్లామాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు, ఇమ్రాన్ ఖాన్‌తో పాటు షేర్ రషీద్, అసద్ కైసర్, సైపుల్లా నైజి, సాదాఖత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా తేల్చింది. ఆవామీ ముస్లిం లీగ్ చీఫ్ అయిన షేక్ రషీద్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఇంటీరియల్ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.






