మాపై దాడి చేస్తే … అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
నిత్యం క్షిపణులు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్ డ్రోన్ వంటివాటితో తన దేశ ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే పాంగ్యాంగ్పై దక్షిణ కొరియా, దాని మిత్రపక్షమైన అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, నిస్సంకోచంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామనని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఒక వేళ శత్రువులు తమ దేశ సౌర్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై నిస్సంకోచంగా అణ్వాయుధాలతో విరుచుకుపడతాం అని కిమ్ పేర్కొన్నారు. పాగ్యాంగ్లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్ సందర్శించిన అనంతరం వ్యాఖ్యానించారు.






