రష్యా, ఉత్తరకొరియా మధ్య కీలక ఒప్పందం
ఉత్తర కొరియా-రష్యా మధ్య స్నేహం మరింత బలపడుతోంది. తమలో ఏ ఒక్కరిపైనైనా శత్రుదేశం దాడి జరిగితే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జూన్‌లోనే దీనిపై సంతకాలు జరగగా దానిని ఉత్తర కొరియా తాజాగా ఆమోదించింది. ఈ ఒప్పందాన్ని రష్యా ఇప్పటికే ఆమోదించింది. ఉక్రెయిన్ యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిత్ర పక్షాల మధ్య పెరుగుతోన్న సైనిక భాగస్వామ్యంతో కిమ్, పుతిన్ ప్రభుత్వాలు మరింత దగ్గరవుతున్నాయి. ఈ రెండు దేశాల స్నేహం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.






