కిమ్ హత్యకు కుట్ర?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన స్పై ఏజెన్సీ చట్టసభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. ఇంటెలిజెన్స్ సర్వీస్ ( ఎన్ఐఎస్) పార్లమెంటరీ ఆడిట్ సెషన్లో ఈ విషయాలను వెల్లడిరచింది. కమ్యూనికేషన్ జామింగ్ వాహనాలు, డ్రోన్లతో కిమ్పై దాడులు జరిగే అవకాశాన్ని గుర్తించినట్లు తెలిపిది. దీంతో ఆయన భద్రతను పెంచినట్లు వెల్లడిరచింది. ఇటీవల కాలంలో సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దాదాపు 110 కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తించింది.






