అమెరికా ఎన్నికలకు కొన్ని గంటల ముందు … ఉత్తరకొరియా
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్తతలు పెంచుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అక్టోబరు 31న ప్రయోగించినట్లు ఆ దేశం గతవారం ప్రకటించగా, తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని గంటల ముందు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశ తూర్పు జలాల్లో ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. అయితే ఎన్ని క్షిపణులను ప్రయోగించింది. అవి ఎంత దూరం వెళ్లాయి అనే దానిపై స్పష్టత లేదని చెప్పింది. అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా రూపొందించిన అత్యాధునికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ పర్యవేక్షించిన కొన్ని రోజుల్లోనే తాజా ప్రయోగాలు చోటు చేసుకోవడం గమనార్హం.






