ట్రంప్ అయినా సరే… ఇక మాట్లాడుకోవడాల్లేవ్
దౌత్యం విషయంలో ఉత్తరకొరియా రూటు మార్చింది. ఇక నుంచి వ్యక్తిగత దౌత్యాలు నెరపకూడదని కిమ్ సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ దూత సాంగ్ కిమ్ న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా అమెరికా ప్రభుత్వంలోనే డీల్ చేస్తాం. ఏ కార్యవర్గం అధికారంలోకి వచ్చినా డీపీఆర్కేతో వ్యవహారాలు జరపాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి అమెరికాకు పారిపోయిన ఓ మాజీ ఉన్నతస్థాయి దౌత్యవేత్త ఇటీవల మాట్లాడుతూ ట్రంప్ కార్యవర్గం అధికారంలోకి వస్తే చర్చలు జరపాలని కిమ్ సర్కారు భావిస్తోందన్నారు. బేరసారాలకు సరికొత్త దౌత్యనీతిపై ఆ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. హారిస్‌ను ఓడిరచి ట్రంప్‌ను అధికారంలోకి తీసుకొచ్చేలా ఉత్తర కొరియా అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు అంచనా వేశారు. అనంతరం ఆంక్షల తొలగింపు, ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను తుడిపేసుకోవాలన్నది వారి లక్ష్యమని వెల్లడిరచారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించారు.






