పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
పారాలింపిక్స్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ పసిడి గెలిచారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్లో 21-14, 18-21, 23-21తో డానియల్ బెతెల్ ( బ్రిటన్)ను ఓడించారు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన బెతెల్ ఈ సారి కూడా ఫైనల్లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో భారత షట్లర్ ఆధిపత్యం ప్రదర్శించగా, రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 11-8తో ఆధిక్యంలో నిలిచి నితేశ్, తర్వాత కాస్త పట్టు తప్పాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ షట్లర్ పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక బూడో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. చివరకు నితేశ్ పైచేయి సాధించాడు.






