న్యూయార్క్ కాల్పుల నిందితుడు అరెస్ట్

అమెరికా దేశంలోని న్యూయార్క్ బ్రూక్లిన్ రైల్వే స్టేషన్‌లో సబ్‌వే కారులో కాల్పులు జరిపిన నిందితుడిగా భావిస్తున్న 62 ఏళ్ల ఫ్రాంక్ జేమ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కోసం 24 గంటల పాటు పోలీసులు వేట సాగించగా, అతడ్ని మాన్‌హట్టన్ వీధిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ కీచంట్ సెవెల్ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. బ్రూక్లిన్‌లో 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో 10 మందికి తుపాకీ గాయాలయ్యాయి. మరో 13 మంది గాయపడి సంగతి విదితమే. కాగా ఈ కాల్పులు ఘటనపై విచాణ చేపడుతున్న పోలీసులు నిందితుడి ఇతనే కావచ్చు అంటూ ఓ ఫోటోను విడుదల చేశారు. అతడ్ని పట్టించిన వారికి 50 వేల డాలర్ల నజారానా ప్రకటించారు. నిందితుడ్ని ఫ్రాంక్ జేమ్స్‌గా పేర్కొన్నారు.