Minister Bezalel : భారత పర్యటనకు ఇజ్రాయెల్ మంత్రి

భారత పర్యటనకు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ రానున్నారు. నేటినుంచి మూడు రోజుల పాటు బెజలెల్ స్మోట్రిచ్ దేశంలో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య కొంతకాలంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్యలు జరుగుతున్నాయని, ప్రస్తుత పర్యటనలో భాగంగా భారత్(India)-ఇజ్రాయెల్ (Israel) ద్వైపాక్షి వాణిజ్య ఒప్పందం పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. స్మోట్రిచ్ గాంధీనగర్ (Gandhinagar) లోని భారతదేశ ప్రపంచ ఆర్థికసేవల కేంద్రాన్ని సైతం సందర్శించనున్నారు.