Donald Trump: త్వరలోనే జిన్‌పింగ్ తో ట్రంప్ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping) తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో భేటీ కానున్నారు. డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈ భేటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తోనూ ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం అధికారి తెలిపారు.