కామన్వెల్త్ సమావేశాల్లో పురందేశ్వరి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చల్లో పాల్గొన్నారు. కామన్వెల్త్ సమావేశాలకు భారత్ ఛాప్టర్ తరుపున ఆమె మన దేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చర్చల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్లో ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ప్రత్యేకించి మహిళలకు నిర్దేశించి పథకాలపై సమగ్రంగా వివరించి చర్చకు పెట్టినట్లు ఆమె తెలిపారు.






