Cyprus: సైప్రస్‌కు ప్రధాని మోదీ.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి!
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్‌కు వెళ్తున్నారు. జూన్ 15, 16 తేదీల్లో సైప్రస్‌లో ప్రధాని మోదీ అధికారిక పర్యటన ఉండనుంది. కాగా గడిచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్బంగానే ప్రధాని కెనడా (Canada)లో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం క్రొయేషియా (Croatia)లో కూడా పర్యటించనున్నారు. మొత్తం ఐదురోజుల పాటు సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో మోదీ పర్యటన కొనసాగనుంది.







