రష్యా-ఉక్రెయిన్ చర్చలు భారత్లోనే : జెలెన్స్కీ
రష్యా`ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి సామర్థ్యాలు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందన్నారు. రష్యా-ఉక్రెయిన్ చర్చలు భారత్లోనే జరగొచ్చని వ్యాఖ్యానించారు. రష్యా భారత్కు చవకగా సరఫరా చేస్తున్న ఇంధన కొనుగోళ్లను ఆపడం ద్వారా మోదీ రష్యా దూకుడుకు కళ్లెం వేయగలరని ఆయన అన్నారు. మా దేశంపై యుద్ధం జరుగుతున్నందువల్ల ప్రత్యర్థితో చర్చలు జరపడం ఎంతో కీలకమైన విషయమన్నారు. ఇందుకోసం నవంబర్లో జరగనున్న రెండో ప్రపంచ శాంతి సదస్సుకు ముందు దేశం తనను తాను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.






