భారత్ దర్యాప్తులో హేతుబద్ధమైన జవాబుదారీతనం ఉండాలి : అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్ర కేసులో భారత్ దర్యాప్తులో హేతుబద్ధమైన జవాబుదారీతనం ఉండేంత వరకూ తాము పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేమని అమెరికా పేర్కొంది. ఆ కుట్రను అమెరికా విఫలం చేసింది. అమెరికా పౌరుడి ( పన్నూ)ని ఆ దేశ గడ్డపైనే హత్య చేసేందుకు జరిగిన కుట్రలో తమకు ఎటువంటి పాత్ర లేదని భారత ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే అమెరికా ఆరోపణల నేపథ్యంలో వాటిపై దర్యాప్తునకు భారత్ ఓ కమిటీని ఏర్పాటు చేసిది. భారత్ చేపట్టిన దర్యాప్తులో హేతుబద్ధమైన జవాబుదారీతో కూడిన ఫలితాలను మేం ఆశిస్తున్నాం. ఆ రకంగా జరగనంత వరకూ మేం పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేం అని విదేశీ వ్యవహారాల విభాగం ఉప అధికార ప్రతినిధి వేదాంత పటేల్ మీడియాతో పేర్కొన్నారు.






