మా పరీక్షలో ఇజ్రాయెల్ విఫలమైంది : అమెరికా
గాజాలో చిక్కుకుపోయిన ప్రజలకు 30 రోజుల్లో ఆహారం, వైద్య సహాయం అందించాలంటూ తాము పెట్టిన పరీక్షలో ఇజ్రాయెల్ విఫలమైందనీ, ఆ దేశానికి ఫెయిల్ గ్రేడ్ ఇస్తున్నామని అమెరికా విదేశాంగ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. గడువు తీరిపోయిన తరవాత ఇజ్రాయెల్‌కు ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించగా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అమెవిదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లు అక్టోబరులో ఇజ్రాయెల్‌కు రాసిన లేఖలో ఇప్పటికి సంవత్సర కాలంగా హమాస్-ఇజ్రాయెల్ పోరులో చిక్కుకు పోయినా పాలస్తీనావాసుల దుస్థితిని ప్రస్తావించారు. వారికి రోజూ కనీసం 350 ట్రక్కుల్లో ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను పంపాలని షరతు విధించారు, కానీ రోజు 71 ట్రక్కులు మాత్రమే గాజాకు వెళ్తున్నాయని ఐక్యరాజ్యసమితి వర్గాలు తెలిపాయి. దాంతో పాలస్తీనావాసుల బాగోగులను చూస్తున్న ఐరాస సంస్థకు ఇజ్రాయెల్ గుర్తింపు రద్దు చేసింది. దీన్ని బ్లింకెన్, ఆస్టిన్లు తమ లేఖలో గట్టిగా ఖండిరచారు. యూదు అతివాదులు వెస్ట్‌బ్యాంక్ లోని పాలస్తీనావారిపై దాడులకు తెగబడటాన్ని విమర్శించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






