ఘనంగా మైటా దశాబ్ది ఉత్సవాలు
మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ( మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్‌రావు, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.






