Leon Marchand : 14 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

ఒలింపిక్ చాంపియన్, ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ (Leon Marchand) మర్చండ్ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ (Swimming Championship) లోనూ తనకు తిరుగులేదని చాటాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌లో మర్చండ్ ఒక నిమిషం 52.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 14 ఏళ్లుగా అమెరికా మేటి స్విమ్మర్ ర్యాన్ లోచెట్ (Ryan Lochte) ((2011లో) నమోదు చేసిన ఒక నిమిషం 54 సెకన్ల ప్రపంచ రికార్డును మర్చండ్ బద్దలుకొట్టాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు (Gold medals) కొల్లగొట్టిన 23 ఏళ్ల మర్చండ్, ఇంకా 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేతో పాటు రిలే ఈవెంట్‌లో పోటీపడాల్సి ఉంది.