అమెరికాలో కలకలం… అదే వాహనంలో 8 ఏళ్ల చిన్నారి
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో ఓ మహిళను హత్య చేసి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. అయితే అతడు చనిపోయిన వాహనంలో 8 ఏళ్ల చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. ఆ చిన్నారి పోలీసుల కాల్పుల్లో మరణించిందా, తండ్రే చంపేశాడా అనేది తేలాల్సి ఉంది. పోలీసు కాల్పుల ఘటన న్యూహాంప్‌షైర్, మైన్ రాష్ట్రాలను కలిపే వంతెనపై జగరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. న్యూ హాంప్‌షైర్‌లోని ట్రాయ్‌లో ఉన్న ఒక ఇంట్లో మహిళను నిందితుడు హత్య చేశాడు. ఇది రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బయలుదేరిన నిందితుడు రెండు రాష్ట్రాల మధ్యన పిస్కాటకా నదిపై ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్నాడు. అప్పుడే పోలీసులు చుట్టు ముట్టి కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు మరణించారు. ఆ తర్వాత వెళ్లి చూడగా 8 ఏళ్ల చిన్నారి మృతదేహం కూడా కనిపించింది. చిన్నారి మరణంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.






