రాహుల్ పై ఐసిసి సీరియస్…? ఫైన్ పడుతుందా…?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ వివాదాస్పదంగా అవుట్ కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థర్డ్ అంపైర్ ను టార్గెట్ గా చేసుకుని ఇండియన్ మీడియా, భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. 17 వికెట్ లు తొలి రోజు పడితే… రాహుల్ వికెట్ అత్యంత వివాదాస్పదం అయింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా… దానిపై ఆస్ట్రేలియా రివ్యూకు వెళ్ళింది. 23వ ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన బంతిని రాహుల్ డిఫెండ్ చేసేందుకు చూడగా… అవుట్ అయినట్టు ప్రకటించారు.
ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు గట్టిగా అప్పీల్ చేయగా… ఫీల్డ్ అంపైర్ నాటౌట్ చెప్పాడు. దీనితో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రివ్యూకు వెళ్ళగా… రివ్యూలో స్నికో మీటర్ పై బంతి బ్యాట్ ను తాకినట్టు కనపడింది. అయితే బ్యాట్… ప్యాడ్ ను తాకిందా బాల్ ను తాకిందా అనేది క్లారిటీ లేదు. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ మాత్రం అది అవుట్ గా ప్రకటించాడు. తర్వాత రిప్లైలో బ్యాట్ ప్యాడ్ ను తాకినట్టు క్లియర్ గా అర్ధమైంది. దీనితో భారత క్రికెట్ అభిమానులు థర్డ్ అంపైర్ పై ఫైర్ అవుతున్నారు. తప్పుడు నిర్ణయం అంటూ మండిపడుతున్నారు.
అవుట్ అయ్యే సమయానికి క్రీజ్ లో ఇతర ఆటగాళ్ళు ఇబ్బంది పడుతున్నా రాహుల్ మాత్రం చాలా సౌకర్యవంతంగా కనిపించాడు. ఆ టైంలో ఈ నిర్ణయంతో రాహుల్ షాక్ అయ్యాడు. మైదానంలోనే అభిమానులు అరవగా… అదే టైం లో రాహుల్ కూడా చేత్తో సంజ్ఞలు చేస్తూ, థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏదో అన్నట్టు కెమెరాలో కనపడింది. దీనితో అంపైర్ కాల్ పట్ల అసమ్మతి తెలిపినందుకు గానూ కేఎల్ రాహుల్కు ఐసిసి ప్రవర్తనా నియమావళిలో భాగంగా లెవల్ 1 కింద జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆటగాళ్ల ప్రవర్తన చట్టం 42.2 ప్రకారం, లెవల్ 1 నేరం మొదటి నేరంగా భావిస్తారు. ఆ విషయంలో… అంపైర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి 5 పరుగులు జరిమానా విధిస్తారు. అంటే ప్రత్యర్ధి జట్టుకు 5 పరుగులు యాడ్ చేస్తారు. కాగా మొదటి రోజున భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్ , అరంగేట్ర ఆటగాడు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ తో ఆస్ట్రేలియాను కట్టడి చేసారు. దీనితో 67 పరుగులకే ఆస్ట్రేలియా 7 వికెట్ లు కోల్పోయింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ బుమ్రా 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ లు పడగొట్టాడు.






