Nitish Kumar Reddy: ఇంగ్లాండ్ టూర్ లో తెలుగోడికి చోటు కష్టమే..?
ఇంగ్లాండ్ పర్యటన అనగానే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరు జట్టులో ఉంటారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ విషయంలో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ విషయంలో మాత్రం అతను విఫలమయ్యాడనే చెప్పాలి. బ్యాటింగ్ విషయంలో భారత్ పెద్దగా ఇబ్బంది పడకపోయినా బౌలింగ్ విభాగం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా పర్యటనలో బౌలింగ్ విభాగం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బూమ్రా మీదనే ఆధారపడిందని ఆరోపణలు ఉన్నాయి.
దానికి తోడు జట్టులో పార్ట్ టైం బౌలర్లు లేకపోవడం కూడా మైనస్ అయిన అంశం. కీలక సమయాల్లో బౌలింగ్ విభాగానికి సహకరించే బ్యాట్స్మెన్ లు తమ బౌలింగ్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే భారత్ ఈ విషయంలో దాదాపు దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతోంది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్(England Tour) పర్యటనలో కచ్చితంగా బౌలింగ్లో జట్టుకు సహకారం కావాల్సి ఉంది. దీనితో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరు జట్టులో ఉంటారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. అయితే కెప్టెన్ గిల్ ఈ విషయంలో సీనియారిటీ మీద ఆధారపడే అవకాశం ఉందని అభిప్రాయాలు వినపడుతున్నాయి.
శార్దూల్ ఠాకూర్.. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో బాల్ తో పాటుగా బ్యాట్ తో కూడా ఆకట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా అతన్నే జట్టులో కొనసాగించే అవకాశం కనబడుతోంది. బౌలింగ్ లో వేగం కూడా ఉంటుంది కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. నితీష్ కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టడం దానికి తోడు ఇటీవల కాలంలో పెద్దగా ఫామ్ లో కూడా లేకపోవడంతో అతనికి అవకాశాలు రావడం కష్టమే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అవకాశాలు వచ్చినా ఒకటి రెండు మ్యాచ్ లలో మాత్రమే అతన్ని పరీక్షించే అవకాశం ఉందని.. అక్కడ ఫెయిల్ అయితే మాత్రం అతని కెరీర్ కు సైతం ప్రమాదం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.







