లెబనాన్వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
హెజ్బొల్లా ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో లెబనాన్ లో ఆ గ్రూప్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేపట్టేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. సరిహద్దు నుంచి 60 కి.మీ దూరంలో ఉంటున్న పౌరులంతా ఖాళీ చేయాలని అందులో పేర్కొంది. 2006 లో ఇజ్రాయెల్`హెజ్బొల్లా యుద్ధం తర్వాత రెండిరటి మధ్య యూఎన్ బఫర్ జోన్‌గా కొంత ప్రాంతాన్ని ప్రకటించింది. దాని ఉత్తర అంచుభాగంలో లిటానీ నది ఉంటుంది. సరిహద్దు నుంచి అక్కడి వరకు దూరం 30 కి.మీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖాళీ చేయమన్న ప్రాంతం దానిని మించి ఉంది.






