Netanyahu: ట్రంప్ నాయకత్వం చరిత్ర సృష్టించింది : నెతన్యాహు

ఇరాన్‌లో అణుకేంద్రాలపై నేరుగా దాడులు చేయడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఇజ్రాయెల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కొనియాడారు. భవిష్యత్తులో ప్రాంతీయ శాంతి సుసంపన్నత సాధనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇరాన్ (Iran) అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలని మీరు (ట్రంప్) తీసుకున్న అద్భుతమైన నిర్ణయం చరిత్రను మార్చబోతోంది. ఎంతో బలమైన సైన్యం మీకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద ఇజ్రాయెల్ (Israel) నిజంగా అద్భుతాలు చేసింది. కానీ తాజాగా మీరు తీసుకున్న చర్య అసమానమైనది. భూ ప్రపంచంలో మరే దేశం చేయలేని పనిని మీరు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పాలనను, ప్రమాదకర ఆయుధాలను తోసిరాజని మీరు చేసిన సాహసాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. పశ్చిమాసియా, మరికొన్ని దేశాలు మున్నుందు శాంతివైపు పయనించడానికి మీ చర్య ఉపయోగపడుతుంది అని చెప్పారు.