అమెరికాతో చర్చలకు సిద్ధమే : ఇరాన్
తమ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చల పునరుద్ధరణకు సిద్ధమేనని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తెలిపారు. అగ్ర రాజ్యంతో చర్చించడం వల్ల నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తద్వారా ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ అమెరికాతో జరుపుతారనుకున్న చర్చలకు ఆయన అడ్డువేసేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శత్రువులతో అసలు చర్చలు జరపబోమని కాదు. జరిపినా అందులో నష్టం లేదు. అయితే వాటిపై అంతగా ఆశలు పెట్టుకోవద్దు అని ఖమేనీ వ్యాఖ్యానించారు. శత్రువును ఎప్పుడూ నమ్మొద్దని పెజెష్కియాన్‌తో పాటు క్యాబినెట్‌కు సూచించారు.






