అమెరికా ఎన్నికలైన వెంటనే దాడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారే సంకేతాలు కనిపించడం లేదు. ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్‌లోని ఏయే లక్ష్యాలను ఢీకొట్టాలో ఓ అవగాహనకు ఇప్పటికే టెహ్రాన్ వచ్చింది. దాడి ప్రణాళికను మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలైన తర్వాతే అమలుపరచాలని భావిస్తోంది. మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు దాడి చేస్తే వాతావరణం ట్రంప్‌నకు అనుకూలంగా మారే అవశాకాలు ఉన్నందున దాడిని వాయిదా వేసినట్లు తెలిసింది. ఇటీవల ఓ సమావేశం సందర్భంగా ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలని సైనిక అధికారులను ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్లతో దాడి చేయొంచొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి.






